Sat Jul 12 2025 22:43:02 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు సిట్ ఎదుటకు మరోసారి ప్రభాకర్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మరోసారి మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును స్సెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారులు విచారిస్తున్నారు

తెలంగాణలో విచారణ జరుపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మరోసారి మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును స్సెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి విచారించిన సిట్ కొన్ని కీలక విషయాలను సేకరించింది. నిన్న ప్రణీత్ రావు ను సిట్ అధికారులు విచారించారు. హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేయడానికి గల కారణాలను ఆయనను ప్రశ్నించి అడిగి తెలుసుకున్నారు.
ఇద్దరు చెప్పిన విషయాలను...
నిన్న ప్రణీత్ రావు నుంచి రాబట్టిన సమాధానాలను బట్టి నేడు ప్రభాక్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ప్రణీత్ రావు వెల్లడించిన విషయాలకు, ప్రభాకర్ రావు చెప్పబోయే విషయాలకు పొంతనపై నేడు సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. దీంతో నేడు సిట్ విచారణ కీలకంగా మారనుందని తెలిసింది. ఇప్పటికే కొందరు ముఖ్యమైన నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావు కూడా విచారణలో అంగీకరించడంతో నేడు ప్రభాకర్ రావు ఏం చేప్తాడన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story