Thu Mar 19 2026 18:26:10 GMT+0530 (India Standard Time)
కోటి విలువైన నిత్యవసరాల పంపిిణీ
కేటీఆర్ జన్మదినం సందర్భంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరద బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు

కేటీఆర్ జన్మదినం సందర్భంగా మాజ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరద బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. కోటి రూపాయల విలువైన నిత్యావసర వస్తువలును పదిహేను వేల మంది బాధిత కుటుంబాలకు పంచారు. వాన కురుస్తున్నప్పటికీ నిత్యావసర వస్తువులను బాధితులకు పంపిణీ చేశారు. నిద్రహారాలు మాని వారు పడుతున్న బాధలను చూసి తాను చలించిపోయానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బూర్గంపాడు, భద్రాచలం మండలాల్లో వరద బాధితులకు ఈ నిత్యవాసరాలను పంపిణీ చేశారు.
అడవి బిడ్డలను ఆదుకుంటా....
ఇటీవల సంభవించిన వరదల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. ఇంట్లో వస్తువులను కూడా కోల్పోయారు. అది చూసి తాను చలించి పోయానని పొంగులేటి తెలిపారు. అడవిబిడ్డలకు అండగా ఉంటానని ఆయన తెలిపారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద ఈ కార్యక్రమం చేపట్టానని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా వరదల్లో చిక్కుకున్న అనేక మందిని కాపాడిన వ్యక్తిని పొంగులేటి ఘనంగా సత్కరించారు భవిష్యత్ లోనూ అడవి బిడ్డలకు అండగా ఉంటానని ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.
Next Story

