Sun Mar 08 2026 04:51:03 GMT+0530 (India Standard Time)
నేడు పాలేరులో ఆత్మీయ సమ్మేళనం
పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరసగా ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈరోజు పాలేరు నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారు.

బీఆర్ఎస్ మాజీ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరసగా ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈరోజు పాలేరు నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాలలో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు పాలేరు నియోజకవర్గంలో ఆత్మీయ సదస్సును నిర్వహిస్తుండటం చర్చనీయాంశమైంది. ఆయన వైఎస్సార్టీపీ తరుపున పోటీ చేస్తారని భావించారు.
ప్రచారాలు జరుగుతున్నా....
బీజేపీ, కాంగ్రెస్ అంటూ ప్రచారం జరిగింది. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తూ వరసగా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ వెళుతున్నారు. ఇదే రాజకీయ పార్టీలకు అర్ధం కాకుండా ఉంది. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది ఇంకా తేలకున్నా ఊహాగాలు మాత్రం నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. పొంగులేటి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఆత్మీయ సమ్మేళనాలను మాత్రం నిర్వహించుకుంటూ వెళుతున్నారు.
Next Story

