Wed Feb 19 2025 21:55:16 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : చెన్నమనేనీ.. 30 లక్షలు చెల్లించు.. హైకోర్టు
మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తప్పుడు సమాచారం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది

మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తప్పుడు సమాచారం ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటీషనర్ ఆది శ్రీనివాస్ కు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని, నెల రోజుల్లో చెల్లింపులు పూర్తి చేయాలని ఆదేశించింది. జర్మనీ పౌరసత్వం ఉండి కూడా తప్పుడు సమాచారం ఇవ్వడమేంటని హైకోర్టు సీరియస్ అయింది.
పౌరసత్వం విషయంలో...
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ దాఖలు చేసిన పౌరసత్వం పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చింది. తప్పుడు డాక్యుమెంట్లు చూపించి ఎమ్మెల్యేగా గెలిచారని కూడా వ్యాఖ్యానించింది. ముప్ఫయి లక్షల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. ఇందులో ఇరవై ఐదు లక్షలు ఆదిశ్రీనివాస్ కు, ఐదు లక్షలు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
Next Story