Thu Dec 18 2025 10:19:11 GMT+0000 (Coordinated Universal Time)
పార్టీ మార్పు ఊహాగానాలకు తెరదించిన తుమ్మల
పార్టీ మార్పుపై ఊహాగానాలకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెరదించారు

పార్టీ మార్పుపై ఊహాగానాలకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెరదించారు. తాను నలభై ఏళ్లుగా రాజకీయాల్లో నీతి, నిజాయితీగా పనిచేశానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట అందరం నడవాల్సిందేనని తెలిపారు. దాదాపు 44 వేల కోట్ల రూపాయలు ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం కేసీఆర్ ఇచ్చారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నలభై సంవత్సరాలుగా తనతో వెన్నంటి ఉన్న వారందరి అభిమానాన్ని వెలకట్టలేనిదని చెప్పారు.
భవిష్యత్ మనదే...
భవిష్యత్ మనదేనని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పారు. రాజకీయాలన్న తర్వాత కష్టాలు, నష్టాలు సహజమని తెలిపారు. ఎప్పుడూ ఆనందం ఉండదని, అలాగే ఎల్లప్పుడూ విషాదం ఉండదని ఆయన అన్నారు. జీవితంలో అన్ని ఉన్నట్లుగానే రాజకీయాల్లోనూ ఉంటాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట అందరం కలసి నడుద్దామని ఆయన తెలిపారు. తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారుతున్నారన్న ఊహాగానాలకు ఈ ఆత్మీయ సమావేశంలో తెరదించినట్లయింది.
Next Story

