Sun Mar 15 2026 16:06:41 GMT+0530 (India Standard Time)
Mothkupalli : నేను చచ్చాక టిక్కెట్ ఇస్తారా? మోత్కుపల్లి కంటతడి
మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు కంటతడి పెట్టారు. ముఖ్యమంత్రి తనకు సీటు రాకుండాచేస్తున్నారన్నారు.

మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు కంటతడి పెట్టారు. ముఖ్యమంత్రి తనకు సీటు రాకుండాచేస్తున్నారన్నారు. తాను చచ్చిన తర్వాత మాదిగలకు సీట్లు ఇస్తారా? అంటూ ఆయన ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో మాదిగలకు రెండు స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంట్లో దీక్షకు దిగారు. ఇదే తన చివరి మీడియా సమావేశం అని అన్నారు. మాదిగలకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా న్యాయం చేయడంలేదన్న మోత్కుపల్లి బీఆర్ఎస్, బీజేపీ రెండు టిక్కెట్లు కేటాయించాయన్న విషయాన్ని గుర్తు చేశారు.
గతంలో ఏ ముఖ్యమంత్రి...
మంద కృష్ణ మాట్లాడినదాంట్లో తప్పేముందని ప్రశ్నించిన మోత్కుపల్లి నరసింహులు మాదిగ జాతికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాల్సిందేనని అన్నారు. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులను తాను చూశానని, ఎప్పుడూ ఇంతటి అన్యాయం జరగలేదన్నారు. అయితే తాను ఏ పార్టీలో చేరనని, కాంగ్రెస్ లోనే కొనసాగుతానని మోత్కుపల్లి నరసింహులు తెలిపారు. ఇప్పటికైనా పార్టీ నేతలు మాదిగలకు పార్లమెంటు ఎన్నికలలో రెండు స్థానాలను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆయన వాపోయారు.
Next Story

