Fri Dec 05 2025 11:15:44 GMT+0000 (Coordinated Universal Time)
ఖమ్మం సభకు ఏపీ నుంచి బస్సులు
ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ సభకు ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దయెత్తున బస్సులు పంపుతున్నారని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు

ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ సభకు ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దయెత్తున బస్సులు పంపుతున్నారని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. జగన్, కేసీఆర్ ఇద్దరూ వేరు కాదని ఆయన అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి కేసీఆర్ ఏపీలో బీఆర్ఎస్ పార్టీని పెట్టి ప్రయత్నిస్తున్నారని జవహర్ విమర్శించారు.
ఇద్దరి మధ్య...
జగన్, కేసీఆర్ ల మధ్య పరస్పర సహాకారం కొత్తేమీ కాదన్న జవహర్, 2019 ఎన్నికల్లో జగన్ కు కేసీఆర్ సహకరించినందుకు రిటర్న్ గిప్ట్ ఇప్పుడు ఇచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం పార్టీ గెలుపును వచ్చే ఎన్నికల్లో ఎవరూ ఆపలేరని మాజీ మంత్రి జవహర్ అన్నారు.
Next Story

