Mon Jun 23 2025 03:06:43 GMT+0000 (Coordinated Universal Time)
Harish Rao : అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చా : హరీశ్ రావు
కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలన్నింటికీ తాను సమాధానం ఇచ్చానని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు

కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలన్నింటికీ తాను సమాధానం ఇచ్చానని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆధారాలతో లన్ని విషయాలను కమిషన్ ముందు ఉంచామని చెప్పారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును ఎందుకు మార్చారని కమిషన్ తనను ప్రశ్నించిందని, దానికి కూడా తాను సమాధానమిచ్చానని చెప్పారు. తుమ్మడిహట్టిలో పనిని ప్రారంభించకుండా ఎక్కడెక్కడో కాల్వలు తవ్వారని, అందుకే మేడిగడ్డకు మార్చాల్సి వచ్చిందని చెప్పానని హరీశ్ రావు మీడియాకు తెలిపారు.
ఆధారాలతో సహా...
తెలంగాణ, మహారాష్ట్రల మధ్య ఐదారు సమావేశాలు జరిగిన తర్వాత మాత్రమే బ్యారేజీ నిర్మాణం జరిగిందని తాను కమిషన్ కు వివరించానని చెప్పారు. నాడు మహారాష్ట్ర, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని, తుమ్మడి హట్టిలో నీళ్లు లేని కారణంగానే మేడిగడ్డ కు మార్చాల్సి వచ్చిందని తెలిపారు. సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన లేఖను కూడా కమిషన్ ముందు ఉంచామని హరీశ్ రావు తెలిపారు. మహారాష్ట్రలతో జరిగిన సమావేశాల వివరాలను కూడా కమిషన్ ఎదుట చెప్పానని హరీశ్ రావు అన్నారు.
Next Story