Tue Jan 06 2026 22:18:33 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : సుప్రీంకోర్టులో హరీశ్ రావు కు బిగ్ రిలీఫ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుకు ఊరట లభించింది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుకు ఊరట లభించింది. నేడు సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరిగింది. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో హారీశ్ రావుకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పినట్లయింది. హైకోర్టు తీర్పు సవాల్ చేసిన తెలంగాణ ప్రభుత్వం మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావుల విచారణ చేపట్టేందుకు అనుమతించాలని కోరనుంది.
ఫోన్ టాపింగ్ కేసులో...
ఫోన్ టాపింగ్ కేసులో హరీశ్ రావును విచారణకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది.గతంలో హరీశ్ రావు పై పంజాగుట్టలో పీఎస్ లో ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేసిన చక్రధర్ గౌడ్ , హరీశ్ రావు పై నమోదైన ఎఫ్ఐఆర్ ను తెలంగాణ హైకోర్టు క్వాష్ చేయడంతో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసింది. నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కానీ ఇందులో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Next Story

