Mon Mar 16 2026 22:28:26 GMT+0530 (India Standard Time)
టీఆర్ఎస్ లో చేరిన స్వామిగౌడ్, శ్రావణ్
తెలంగాణ రాష్ట్ర సమితిలో మాజీ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ చేరారు. ఆయన కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిపోయారు.

తెలంగాణ రాష్ట్ర సమితిలో మాజీ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ చేరారు. ఆయన కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిపోయారు. గతంలో స్వామిగౌడ్ టీఆర్ఎస్ లోనే ఉండేవారు. అయితే మరోసారి శాసనమండలికి ఎంపిక చేయకపోవడంతో ఆయన ఆగ్రహంతో బీజేపీలో చేరిపోయారు. అయితే ఇటీవల బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిపోవడంతో తిరిగి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఆయన టీఆర్ఎస్ లో చేరిపోయారు.
సొంత గూటికి...
అలాగే బీజేపీ లో ఉన్న దాసోజు శ్రావణ్ కూడా టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఆయన కూడా తొలత టీఆర్ఎస్ లో తొలుత పనిచేశారు. తిరిగి ఆయన కూడా టీఆర్ఎస్ లో చేరిపోయారు. మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో స్వామి గౌడ్ వీరోచిత పోరాటం చేశారన్నారు. దాసోజు శ్రావణ్ సెల్ఫ్ మేడ్ లీడర్ అని తెలిపారు.
- Tags
- swami gowd
- trs
Next Story

