Fri Dec 05 2025 09:31:18 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేడు కేసీఆర్ కీలక సమావేశం
నేడు నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల నేతలతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు

నేడు నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల నేతలతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. కేసీఆర్ గత కొద్దిరోజులుగా వివిధ జిల్లాల నేతలతో వరసగా సమావేశమవుతున్న నేపథ్యంలో ఈరోజు నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో నేతలతో కేసీఆర్ సమావేశం జరుగుతుంది.
సిల్వర్ జూబ్లీ వేడుకలకు...
ఈ నెల 27వ తేదీన పార్టీ రజతోత్సవ వేడుకలను వరంగల్ లో జరుపుతున్న నేపథ్యంలో దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ నేతలతో సమావేశమై వారికి ఈ సభ ప్రాధాన్యత గురించి వివరిస్తూ, జనసమీకరణతో పాటు కార్యకర్తలను సభకు తరలించడం, తిరిగి చేర్చడం వరకూ తీసుకునే బాధ్యతలను గుర్తు చేస్తున్నారు. సభను పూర్తి స్థాయిలో సక్సెస్ చేయాలన్న ఉద్దేశ్యంతో కేసీఆర్ వరస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
Next Story

