Mon Feb 02 2026 14:30:23 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Redddy : జాతి పిత టైటిల్ వారికి వారే పెట్టుకుంటారా?
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో ఎవరికి వారే తమకు తాము జాతి పిత అని టైటిల్ ఇచ్చుకుంటున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఎంత అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఇవ్వాల్సిన టైటిల్ ను మీకు మీరు పెట్టుకుంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఏకతాటిపైకి తెచ్చిన ప్రొఫెసర్ కోదండరామ్ ను, నాటి ఉద్యమ నేత రావి నారాయణరెడ్డిని ఏమనాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం కోసం నాడు చాలా మంది తమ ఆస్తులు త్యాగం చేశారని అన్నారు.
ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని...
కానీ మీరు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన ఆస్తులెన్నో అందరికీ తెలుసునని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జార్ఖండ్ రాష్ట్రాన్ని తెచ్చిన శిబూ సోరెన్ ను కూడా విచారించారని, ఇంటివద్ద విచారణ చేస్తే ఇంత రాద్ధాంతం చేస్తారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఉద్యమకారుడు అనే పదాలను వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారని అన్నారు. ఎంతటి వారైనా విచారణను ఎదుర్కొనాల్సిందేనని అన్నారు. నాడు తెలంగాణ ఉద్యమం కోసం అందరినీ ఏకం చేసిన కోదండరామ్ ఇంటి తలుపులను పగుల గొట్టిని విషయం గుర్తుకు రాలేదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Next Story

