Sun Apr 05 2026 21:45:12 GMT+0530 (India Standard Time)
Etala Rajender : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన ఈటల
బీజేపీ పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు.

బీజేపీ పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ లో చేరేది లేదని ఈటల స్పష్టం చేశారు. పార్టీ మారుతానని కొంతకాలంగా కొందరు పిచ్చి ప్రచారం చేస్తున్నారన్నారన్న ఈటల తాను, బొడిగే శోభ పార్టీ మారుతున్నామన్నది అవాస్తవమని చెప్పారు. పార్టీ మారడం బట్టలు మార్చుకున్నంత సులభం కాదన్న ఈటల రాజేందర్ తనను కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి బయటకు పంపి ఐదేళ్లవుతుందని తెలిపారు. ఆ తర్వాత తాను బీజేపీలో చేరానని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ లో పరిచయం ఉన్న నేతలు...
తాను ఇరవై ఐదేళ్లుగా బీఆర్ఎస్ లో ఉన్నాను కాబట్టి అత్యధికంగా పరిచయం ఉన్నవారు, అభిమానించే వారు బీఆర్ఎస్ లో ఉన్నారని, అంత మాత్రాన వారితో మాట్లాడితే పార్టీలో చేరుతున్నట్లు కాదని స్పష్టం చేశారు. ఈటలను వదులుకుని కేసీఆర్ తప్పు చేశారని ప్రజలు అంటున్నారన్న ఈటల తనను బర్తరఫ్ చేయడమే కాకుండా నన్ను ఇబ్బందులు గురిచేశారన్నారు. తనకు చెందిన కోళ్ళ ఫార్మ్ లు కూల్చారని, భూములు గుంజు కున్నారని, తాను లీగల్ లు గా కొనుక్కున్నవి చెరబట్టారని కూడా ఈటల తెలిపారు. దీంతో ఈటల రాజేందర్ బీజేపీలోనే కొనసాగుతారని మరోసారి ఆయనచెప్పకనే చెప్పారు.
బీజేపీ నాయకత్వం సూచన మేరకే...
మరొకవైపు బీజేపీ నాయకత్వం సూచన మేరకే తాను నడుచుకుంటానని తెలిపారు. తన పార్లమెంట్ పరిధిలో తనకున్న అవగాహాన వేరే వారికి ఉండదని అంటూనే హుజూరాబాద్ మీ పరిధి కాదని, ఎన్నికలప్పుడు అటు పోలేదని చెప్పారు. హుజురాబాద్ లో తాను ఉన్నప్పుడు మున్సిపల్ ఛైర్మన్, జడ్పీటీసీ ఓడిపోలేదని అన్నారు. ఈ సారి ఆ పార్లమెంట్ పరిధిలో జోక్యం చేసుకోవద్దన్నారని చేసుకోలేదన్నతన పార్టీ ఏమీ ఆలొచిస్తుంది అదే తాను కూడా ఆలోచిస్తానని చెప్పారు. అయితే హుజూరాబాద్ డంపింగ్ యార్డ్ పై అక్కడి ప్రజలు పిలిస్తే వెళ్లి నాయకత్వం వహిస్తానని మాత్రం ఈటల తెలిపారు.
Next Story

