Thu Jan 29 2026 02:22:52 GMT+0000 (Coordinated Universal Time)
శరణ్ చౌదరి ఎవరో నాకు తెలియదు : ఎర్రబెల్లి
తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో నిజాయితీగానే వ్యవహరించానని ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు

తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో నిజాయితీగానే వ్యవహరించానని ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ తనపై కేసులు పెట్టాలని అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. శరణ్ చౌదరి అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని, తనపై ఆయన ఆరోపణలు చేసినట్లు మీడియాలో మాత్రమే చూశానని అన్నారు.
భూ దందాలు చేస్తున్నాడని...
శరణ్ చౌదరి బీజేపీలో ఉన్నట్లు తన విచారణలో తేలిందన్నారు. భూములు, దందాలు చేస్తున్నాడని తెలిసి శరణ్ చౌదరిని బీజేపీ పార్టీ నుంచి తొలగించిందని ఆయన అన్నారు. ఎన్నారైలను కూడా అతడు కోట్ల రూపాయల మేరకు వసూలు చేసి మోసం చేశాడని, మీడియా వాస్తవాలు తెలుసుకుని రాయాలని ఆయన కోరారు. అతనికి, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
Next Story

