Sat May 18 2024 18:24:44 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా నేడు ఎనుమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా నేడు ఎనుమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎల్.బి. స్టేడియలో జరగనున్న ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ రేవంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తెలంగాణకు మూడో ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఏర్పాట్లు పూర్తి...
ఎల్.బి. స్టేడియంలో ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేవంత్ తో పాటు మరో ఐదుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. ఈ ప్రమాణ స్వీకారానికి జాతీయ నేతలు హాజరు కానుండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ తొలి సారి అధికారంలోకి రావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. ఎల్.బి. స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా సెక్రటేరియట్ కు చేరుకుని తన ఛాంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలను తీసుకోనున్నారు.
Next Story