Sat Feb 21 2026 13:23:23 GMT+0530 (India Standard Time)
Kamareddy : కామారెడ్డిలో హై టెన్షన్.. కాంగ్రెస్ నేత కారు ధ్వంసం
కామారెడ్డి లో ఉదయం నుంచి ఉద్రికత్త నెలకొంది

కామారెడ్డి లో ఉదయం నుంచి ఉద్రికత్త నెలకొంది. ఎమ్మెల్యే వర్సెస్ షబ్బీర్ అలిగా గత కొద్ది రోజులుగా వాగ్వాదాలు జరుగుతున్నాయి. అయితే బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఇంటికి కాంగ్రెస్ నేత వాహనాన్ని బీజేపీ నేతలు ధ్వంసం చేశారు. దీంతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద తీవ్ర స్థాయిలో టెన్షన్ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరికొకరు బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించడంతో ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు, శిశు మందిర్ పాఠశాల, అరోరా కాలేజీ భూముల కబ్జా విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పర ఆరోపణలు చేస్తున్నాయి. నిజా నిజాలు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి సవాల్ విసిరారు.
చర్చకు సిద్ధమని...
చర్చకు సిద్ధమన్న కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. శిశు మందిర్ వేదిక కు చర్చకు రెండు పార్టీల సిద్ధం అని ప్రకటించడంతో కామారెడ్డి లో టెన్షన్ నెలకొంది.కాంగ్రెస్ నాయకులు సాక్ష్యాధారాల తో చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి కోరారు. దీంతో కాంగ్రెస్ నేతలు అక్కడకు రావడంతో వారి వాహనాన్ని ధ్వంసం చేశారు. కాంగ్రెస్ బీజేపీ నేతల బహిరంగ చర్చకు అనుమతి లేదంటున్న పోలీసులు ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయినా సరే ఇరువర్గాలు పరస్పరం దాడులకు తెగబడటంతో పోలీసులు చెదరగొట్టారు. ఎమ్మెల్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Next Story

