Fri Mar 20 2026 23:04:16 GMT+0530 (India Standard Time)
Kalvakuntla Kavitha : నేడు నాలుగో రోజు కవిత విచారణ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ నాలుగో రోజు నేడు జరగనుంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ నాలుగో రోజు నేడు జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే వందల కోట్ల ముడుపులు అందించారన్న ఆరోపణలను ఈడీ చేయడంతో ఆ దిశగా నాలుగు రోజుల నుంచి ఈడీ అధికారులు కవితను విచారిస్తున్నారని తెలిసింది.
ముడుపులు సేకరించడానికి...
ఢిల్లీ లిక్కర్ పాలసీని మార్చడానికి అవసరమైన ముడుపులను దక్షిణ భారతదేశంలోని పలు లిక్కర్ వ్యాపారుల నుంచి ముడుపులు సేకరించి ఇచ్చిన విషయంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన వారి స్టేట్మెంట్ల ఆధారంగా కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 23వ తేదీ వరకూ కవితను ఈడీ విచారించవచ్చని న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రతి రోజు సాయంత్రం కుటుంబ సభ్యులను కలిసే అవకాశం కవితకు కోర్టు కల్పించింది.
Next Story

