Sat Dec 06 2025 12:24:39 GMT+0000 (Coordinated Universal Time)
Breaking Kalvakuntla Kavitha: 8.45 గంటలకు విమానంలో ఢిల్లీకి కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు

Kalvakuntla Kavitha:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు కూడా విమానం టిక్కట్లు ఈడీ అధికారులు బుక్ చేసుకున్నారు. రాత్రి 8.45 గంటలకు ఢిల్లీ విమానంలో ఆమెను తీసుకెళ్లేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు కవిత భర్తకు ఈడీ అధికారులు సమాచారం ఇచ్చిన తర్వాతనే కవితను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.
రాత్రికి ఢిల్లీకి తీసుకెళ్లి...
శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి రాత్రికి ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారించనున్నారని చెబుతున్నారు. కేటీఆర్, హరీశ్‌రావులు ఈడీ అధికారులతో మాట్లాడుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని వాళ్లు అధికారులను ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఈడీ అధికారులను నిలదీస్తున్నారు. కవితకు సంబంధించిన న్యాయవాదులు కూడా ఈడీ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.
Next Story

