Fri Dec 05 2025 15:54:11 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో ఈడీ సోదాలు
హైదరాబాద్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు

హైదరాబాద్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గొర్రెల పంపకంలో జరిగిన అవకతవకలపై ఏసీబీ కేసు నమోదు ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో మొత్తం ఎనిమిది చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వమిస్తున్నారు. ఇప్పటికే కొందరు పశుసంవర్థక శాఖ అధికారులు అరెస్టయ్యారు.
గొర్రెల పంపిణీ, కొనుగోళ్లపై...
గొర్రెల పంపిణీ, కొనుగోళ్లపై పెద్దయెత్తున కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఎన్ని గొర్రెలను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? ఎవరెవరికి పంపిణీ చేశారు. గొర్రెలను కొనుగోలు చేసిన ధర ఎంత? ఎంత మందికి పంపిణీ చేశారన్న దానిపై తెలంగాణ వ్యాప్తంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
Next Story

