Thu Nov 30 2023 14:47:14 GMT+0000 (Coordinated Universal Time)
Delhi liquor scam : నేడు విచారణ... డుమ్మా
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు కల్వకుంట్ల కవిత హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు కల్వకుంట్ల కవిత హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. అయితే ఈరోజు విచారణకు తాను హాజరు కాకూడదని కవిత నిర్ణయించుకున్నారు. కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రంకోర్టులో తాను వేసిన పిటీషన్ ను కొట్టివేసిన తర్వాతనే విచారణకు హాజరు కావాలని కవిత నిర్ణయించుకున్నారు. అందుకే ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుటకు తమ తరుపున న్యాయవాదులను కవిత పంపమనున్నారు.
వెళ్లకూడదని...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈ ఏడాది మార్చి నెలలో వరసగా మూడు రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించి వదిలేశారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. అయితే అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్ గా మారడంతో కవితను మరోసారి విచారించాలని అధికారులు నిర్ణయించారు. అయితే తాను విచారణకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. కవిత విచారణకు వెళ్లకుంటీ ఈడీ అధికారులు ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది. ఆమె తరుపున న్యాయవాదులు హాజరవుతున్నందున ఏం జరగనుందని తెలియనుంది.
Next Story