Sat Mar 07 2026 02:05:11 GMT+0530 (India Standard Time)
బ్యాంక్ మోసం కేసులో 26 కోట్ల ఆస్తుల జప్తు
బ్యాంక్ మోసం కేసులో 26.81 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అటాచ్ చేశారు

బ్యాంక్ మోసం కేసులో 26.81 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అటాచ్ చేశారు. అప్పటి ఆంధ్రా బ్యాంక్ నుంచి సౌభాగ్య ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టర్మ్ లోన్లు తీసుకుంది. బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలను అనుమతించిన ప్రయోజనాలకు వాడకుండా వేరే మార్గాలకు మళ్లించి దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తింంచారు.
నకిలీ పత్రాలతో...
నకిలీ పత్రాలతో రుణం పొందినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. కంపెనీ డైరెక్టర్ సహా సంబంధిత వ్యక్తులపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో పాటు వారి ఆస్తులను కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు జప్తు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
Next Story

