Sun Mar 15 2026 14:06:34 GMT+0530 (India Standard Time)
నేడు విచారణకు సునీల్ కనుగోలు
కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు నేడు సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు.

కాంగ్రెస్ వార్ రూమ్ కేసుకు సంబంధించి ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు నేడు సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీసీఎస్ పోలీసులు ఇచ్చిన 41 సీఆర్పీసీ నోటీసులపై సునీల్ కనుగోలు హైకోర్టును ఆశ్రయించారు.
అరెస్ట్ చేయవద్దని...
అయితే హైకోర్టు సునీల్ కనుగోలును అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఈ నెల 9వ తేదీన పోలీసుల ఎదుట విచారణకు హాజరై వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని పేర్కొంది. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వంపై పలు రకాల ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడి చేసి పలు కీలక డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.
Next Story

