Mon Feb 02 2026 07:45:38 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు ఎన్నికల నోటిఫికేషన్
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ పదవులకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ పదవులకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఉప ఎన్నిక కోసం ఇప్పటికే వేర్వేరుగా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకూరుతుందని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే నోటిఫికేషన్ ఎలా ఇస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
రెండు స్థానాలకు...
స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి, హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో రెండు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నిక అనివార్యమయింది. ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్ నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
Next Story

