Thu Mar 19 2026 04:42:56 GMT+0530 (India Standard Time)
Breaking : కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధాన్ని విధించిన ఈసీ
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. నలభై ఎనిమిది గంటల పాటు కేసీఆర్ ప్రచారంలో పాల్గొన కూడదని ఎన్నికల కమిషన్ తన ఆదేశాల్లో పేర్కొంది. రెండు రోజుల క్రితం సిరిసిల్ల సభలో చేసిన వ్యాఖ్యలపై ఆయనపై ఈ నిషేధం విధించింది.
48 గంటల పాటు...
ఎన్నికల కమిషన్ విధించిన నిషేధం ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి అమలులోకి రానుందని ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి ఆయన ప్రచారం నిర్వహించడంతో ఎన్నికల కమిషన్ కేసీఆర్ పై చర్యలు తీసుకుంది. నలభై ఎనిమిది గంటల పాటు ప్రచారంపై నిషేధాన్ని విధించింది.
Next Story

