Sun Dec 14 2025 13:26:32 GMT+0000 (Coordinated Universal Time)
KCR : కేసీఆర్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు
ఎన్నికల కమిషన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని నోటీసులు జారీ చేసింది

ఎన్నికల కమిషన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. సిరిసిల్ల సభలో రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది.
రేవంత్ నుద్దేశించి...
ఈ నెల 18వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై రేపు ఉదయం పదకొండు గంటలలోగా కేసీఆర్ ఈసీ నోటీసుకు వివరణ ఇవ్వాల్సి ఉంది. సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసీఆర్ పై కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
Next Story

