Sun Mar 15 2026 07:55:00 GMT+0530 (India Standard Time)
Breaking : తెలంగాణలో పోలింగ్ సమయం పొడిగింపు
తెలంగాణలో పోలింగ్ సమయాన్ని ఎన్నికల కమిషన్ పొడిగించింది.

తెలంగాణలో పోలింగ్ సమయాన్ని ఎన్నికల కమిషన్ పొడిగించింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ మాత్రమే పోలింగ్ జరుగుతుంది.
ఎండల తీవ్రతతో...
కానీ మండుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని, అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో అంటే మావోలు ప్రభావం ఉన్న చోట మాత్రం ముందుగానే పోలింగ్ ను ముగించాలన్న నిర్ణయానికి వచ్చారు.
Next Story

