Mon Dec 22 2025 07:31:47 GMT+0000 (Coordinated Universal Time)
రాష్ట్రపతి పర్యటిస్తున్న సమయంలోనే బీఆర్ఎస్ కు రాజీనామా
బీఆర్ఎస్ పార్టీకి 18 మంది సర్పంచ్ లు రాజీనామాలు చేశారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తూ తమ నిరసనను తెలియచేశారు

బీఆర్ఎస్ పార్టీకి 18 మంది సర్పంచ్ లు రాజీనామాలు చేశారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తూ తమ నిరసనను తెలియచేశారు. వాంకిడి మండలానికి చెందిన 18 మంది ఆదివాసీ సర్పంచ్ లు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివాసీ సర్పంచ్ల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా ఈ రాజీనామాలు చేస్తున్నట్లు వారు ప్రకటించారు.
నిధులు విడుదల చేయకుండా...
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ ఛైర్మన్ కోవా లక్ష్మి తమను పట్టించుకోవడం లేదని, రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమ పంచాయతీలకు నిధులు విడుదల కావడం లేదని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా తమను ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. రాష్ట్రపతి తెలంగాణ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆదీవాసీ సర్పంచ్ లు పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.
- Tags
- sarpanches
- brs
Next Story

