Fri Dec 05 2025 09:36:50 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయానికి రెడీ అయ్యారా?
తెలంగాణ స్పీకర్‌కు ఎనిమిది మంది ఎమ్మెల్యేల వివరణ ఇచ్చారు. ఇప్పటికీ తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమేనంటూ లేఖ రాశారు.

తెలంగాణ స్పీకర్‌కు ఎనిమిది మంది ఎమ్మెల్యేల వివరణ ఇచ్చారు. ఇప్పటికీ తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమేనంటూ లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ పార్టీ మారినట్లు ఆరోపణలున్న ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులకు ఇద్దరు తప్ప ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తమ వివరణ ఇచ్చారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం తమకు కొంత సమయం కావాలసిన స్పీకర్ ను కోరారు. వివరణ ఇచ్చిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని స్పీకర్‌కు స్పష్టంచేశారు.
వివరణ ఇచ్చిన...
నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశామని తెలిపారు. ముఖ్యమంత్రి వేసింది కాంగ్రెస్ కండువా కాదు.. జాతీయ జెండా కండువాఅని వివరణలో పేర్కొన్నారు. తాము ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నామంటూ ఫొటోలు, వేతన రసీదులు, ఆధారాలతో ఎమ్మెల్యేలలు లేఖతో పాటు జత చేసి పంపారు. పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఇవ్వడం సంప్రదాయమంటూ లేఖలో వివరణ ఇచ్చిన గాంధీ, ఎమ్మెల్యేలను వేర్వేరుగా విచారించాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు.
Next Story

