Fri Dec 05 2025 19:52:11 GMT+0000 (Coordinated Universal Time)
Big Breaking ఎస్.ఎల్.బి.సి. టన్నెల్ లో చిక్కుకున్న ఎనిమిది మంది మృతి
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో ఎనిమిది మృతదేహలు లభ్యమయ్యాయి

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో ఎనిమిది మృతదేహలు లభ్యమయ్యాయి. సహాయక బృందాలు ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయిన ప్రాంతానికి చేరుకున్నారు. ఎనిమిది మృతదేహలకు మార్కింగ్ చేశారు. గత శనివారం ఉదయం 8.30 గంటలకు టన్నెల్ లో చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తీసుకు వచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేశారు.
బయటకుతీసుకు వచ్చేందుకు...
అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిన బురద, నీటితో నిండుకుపోవడంతో టన్నెల్ లో వెళ్లేందుకు అడ్డంకిగా మారింది. మొత్తం ఎనిమిది మంది టన్నెల్ లో చిక్కుకోగా ఎనిమిది మృతదేహాలను మాత్రమే గుర్తించగలిగారు. వాటిని బయటకు తీసుకువచ్చేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్నున్నాయి. టన్నెల్ లో చిక్కుపోయిన వారిలో ఇద్దరు ఇంజనీర్లు, ఆరుగురు కార్మికులు ఉన్నారు.
Next Story

