Sat Mar 07 2026 20:44:10 GMT+0530 (India Standard Time)
నేడు సబిత కీలక భేటీ
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో సమావేశమవుతున్నారు

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో సమావేశమవుతున్నారు. సాయంత్రం జూనియర్ కళాశాల యాజమాన్యాలతో సమావేశమై వారితో ఇటీవల జరుగుతున్న ఘటనలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి పథ్నాలుగు కళాశాలల యాజమాన్యాలకు ఆహ్వానం అందింది.
ఇంటర్ కళాశాలల యాజమాన్యాలతో...
ఇటీవల హైదరాబాద్లోని నార్సింగిలోని శ్రీచైతన్య కళాశాలలో సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. లెక్చరర్ల వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని సూసైడ్ లెటర్ లో సాత్విక్ పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై విద్యార్థులపై వత్తిడి లేని చదువులు తేవాలని యాజామాన్యాలతో సమావేశమవుతుంది.
Next Story

