Thu Mar 19 2026 12:14:42 GMT+0530 (India Standard Time)
మునుగోడులో నోట్ల కట్టల స్వాధీనం
పోలీసుల తనిఖీల్లో మునుగోడు నియోజకవర్గానికి తరలిస్తున్న డబ్బును పోలీసులు పట్టుకుంటున్నారు

మునుగోడు ఉప ఎన్నికల్లో డబ్బుల కట్టలు బయటపడుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో మునుగోడు నియోజకవర్గానికి తరలిస్తున్న డబ్బును పోలీసులు పట్టుకుంటున్నారు. ఈరోజు 19 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిన్న కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఉప ఎన్నికల్లో...
ఎన్నికల్లో అన్ని పార్టీలు డబ్బులను విపరీతంగా పంచుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈరోజు తాజాగా కారులో అక్రమంగా తరలిస్తున్న 19 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి పోలీసులు ఎంత ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు.
Next Story

