Sun Dec 14 2025 00:20:54 GMT+0000 (Coordinated Universal Time)
Dk Aruna : దిక్కులేని కాంగ్రెస్ దిక్కుమాలిన పనులు : డీకే అరుణ
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు

కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే పాలమూరు జిల్లాలో రోడ్లు బాగు చేయాలని సవాల్ విసిరారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇచ్చిన హామీలకు దిక్కులేక కేంద్రం నిధుల కాంగ్రెస్ కోసం కక్కుర్తి పడుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై నారాయణపేటలో డీకే అరుణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సర్పంచ్ ల పదవి కాలం అయిపోగానే ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని ప్రశ్నించారు. రాష్ట్రం లో కాంగ్రెస్ సర్కార్ దివాలా తీసిందని డీకే అరుణ అన్నారు.
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు...
వీళ్ళ చేతకానితనం వాళ్ళ కేంద్ర నుంచి రావాల్సిన మూడు వేల కోట్ల రూపాయల పంచాయతీల నిధులు ఆగిపోయాయని ఎంపీ డీకే అరుణ చెప్పారు. ఆ నిధుల కోసమే కాంగ్రెస్ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే ఆలోచన చేస్తోందన్నారు. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ తీరు చూస్తే నవ్వొస్తుందన్న డీకే అరుణ 2011 ప్రకారం ఎస్సీ, ఎస్టీ సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లని చెబుతున్నారని అన్నారు. 2024 సర్వే ప్రకారం వార్డ్ మెంబెర్స్ రిజర్వేషన్లంటూ పార్టీ పరంగా బీ సీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పార్టీ గుర్తులపై సర్పంచులు గెలవరని, అలాంటప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్స్ ఎలా ఇస్తారంటూ డీకే అరుణ ప్రశ్నించారు.
Next Story

