Fri Dec 05 2025 14:34:11 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి రానున్నారు. లాంఛనంగా రేషన్ కార్డులను ప్రారంభిస్తారు. అనంతర జరిగే సభలో ప్రసంగిస్తారు. ఈ సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బహిరంగ సభలో...
రేషన్ కార్డులను కొత్తగా దాదాపు రెండున్నర లక్షల మందికి పంపిణీ చేసే అవకాశముంది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 2.4 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల దారులకు కొత్త కార్డులను ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 11.30 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం చెబుతుంది. తెలంగాణలో గత ఆరు నెలల నుంచి నలభై ఒక్క లక్షల మందికి ప్రభుత్వం రేషన్ కార్డులను మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో రేషన్ కార్డుల దారుల సంఖ్య 95 లక్షల మందికి చేరనుంది. దాదాపు మూడున్నర కోట్ల మందికి లబ్ది చేకూరనుంది. పార్కింగ్ కోసం ప్రత్యేకంగా పదకొండు స్థలాలను ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేయనున్నారు.
Next Story

