Mon Mar 16 2026 00:47:41 GMT+0530 (India Standard Time)
మోహన్ బాబు కేసుపై స్పందించిన డీజీపీ
సినీనటుడు మోహన్ బాబు కేసు పై డీజీపీ జితేందర్ స్పందించారు.

సినీనటుడు మోహన్ బాబు కేసు పై డీజీపీ జితేందర్ స్పందించారు. చట్ట ప్రకారం మోహన్ బాబుప చర్యలు ఉంటాయని తెలిపారు. మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేయడం విచారకరమని అన్న ఆయన న్యాయపరంగానే తాము ముందుకు వెళతామని తెలిపారు. సంథ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలా దురదృష్టకరమని డీజీపీ జితేందర్ అన్నారు.
అల్లు అర్జున్ పై...
అల్లు అర్జున్ పై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, చట్ట ప్రకారం మాత్రమే చర్యలు తీసుకున్నామని డీజీపీ జితేందర్ తెలిపారు. అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సినిమాల్లో హీరోలు అయినా బయట పౌరులేనని, ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం శిక్షిస్తామని డీజీపీ జితేందర్ తెలిపారు. మోహన్ బాబుపై కూడా కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

