Sat Mar 07 2026 16:32:46 GMT+0530 (India Standard Time)
Yadadri : యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. దర్శన సమయం ఎంతంటే?
యాదాద్రికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. వరసగా మూడు రోజులు సెలవులు రావడంతో ఎక్కువ మంది భక్తులు తరలి వచ్చారు

యాదాద్రికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. వరసగా మూడు రోజులు సెలవులు రావడంతో ఎక్కువ మంది భక్తులు తరలి వచ్చారు. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ప్రత్యేక దర్శన సమయం గంట పడుతుందని చెప్పారు.
ఆదివారం కావడంతో...
ఆదివారం కావడంతో యాదాద్రి భక్తులు రద్దీ మరింతగా పెరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడంతోనే భక్తులతో యాదాద్రి ఆలయం కిటకిటలాడుతుంది. పార్కింగ్ కు కూడా స్థలం దొరక్క కిందనే తమ వాహనాలను పార్క్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొండపైకి వెళ్లే బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి.
Next Story

