Sat Mar 07 2026 13:20:19 GMT+0530 (India Standard Time)
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు.. దర్శనం కోసం?
యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.

యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో పాటు హైదరాబాద్ కు వచ్చిన పర్యాటకులు యాదాద్రిని దర్శించుకోవడానికి వస్తుండటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని గత ప్రభుత్వం పునర్నించిన సంగతి తెలిసిందే.
నూతన ఆలయ నిర్మాణాన్ని...
అద్భుతంగా నిర్మాణం జరిగిన ఈ ఆలయాన్ని సందర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తుండటంతో గుట్ట కిటకిట లాడుతోంది. ఈరోజు స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతుందని వెల్లడించారు. ఉదయం నుంచే క్యూ లైన్ లో భక్తులు బారులు తీరి ఉండటం కనిపించింది.
Next Story

