Tue Feb 18 2025 10:22:02 GMT+0000 (Coordinated Universal Time)
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు... దర్శన సమయం ఎంతంటే?
యాదగిరి గుట్టకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. కార్తీక మాసం కావడంతో పాటు ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.

యాదగిరి గుట్టకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. కార్తీక మాసం కావడంతో పాటు ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు తరలిరావడంతో వారికి దర్శనం సులువుగా అయ్యే ఏర్పాట్లను ఆలయ అధికారులు చేస్తున్నారు. వీలయినంత త్వరగా స్వామి వారిని దర్శించుకునేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
కార్తీకమాసం.. ఆదివారం కావడంతో...
యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది తరలి రావడంతో భక్తులతో ఆలయంలోని మాడ వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులకు మూడు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు చెబుతున్నారు. కొండ పైన, కింద పార్కింగ్ అంతా వాహనాలతో నిండిపోయాయి.
Next Story