Fri Dec 05 2025 17:11:03 GMT+0000 (Coordinated Universal Time)
జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు
జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉదయం పొగమంచు.. మధ్యాహ్నం ఎండలతో విచిత్రమైన వాతావరణం ఏర్పడింది

జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉదయం పొగమంచు.. మధ్యాహ్నం ఎండలతో విచిత్రమైన వాతావరణం ఏర్పడింది. జాతీయ రహదారిపై ఉదయం నుంచి పొగమంచు ఏర్పడటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులుగా మారాయి. వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. అనేక చోట్ల వాహనాలు కనిపించక డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు.
మధ్యాహ్నానికి...
అదే జాతీయ రహదారిపై మధ్యాహ్నానికి వాతావరణం ఒక్కసారిగా మారనుంది. తీవ్రమైన ఎండలతో హీటెక్కిపోతుంది. రాత్రి వేళ ప్రయాణం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల దాటిన తర్వాత మాత్రమే పొగమంచు కొంత వీడుతుంది. తెల్లవారు జాము నుంచి దట్టమైన పొగమంచు వాహనాల రాకపోకలకు ఇబ్బందులుగా మారింది.
Next Story

