Mon Feb 17 2025 11:09:39 GMT+0000 (Coordinated Universal Time)
కవిత బెయిల్ పిటీషన్ పై విచారణ వాయిదా
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణను న్యాయస్థానం ఎల్లుండికి వాయిదా వేసింది

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణను న్యాయస్థానం ఎల్లుండికి వాయిదా వేసింది. కవిత దాఖలు చేసిన పలు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఈ రోజు విచారణ జరిగింది.తదుపరి విచారణను రౌస్ అవన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ భవేజా ఆగస్ట్ 7వతేదీకి వాయిదా వేశారు.
ఎల్లుండికి వాయిదా...
సీనియర్ అడ్వోకేట్ అందుబాటులో లేకపోవడంతో కేసును మరో రోజుకు వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. ఈ క్రమంలో తదుపరి విచారణను జడ్జి వాయిదా వేశారు.మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు ఢిల్లీకి చేరుకున్నారు. వీరు రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉంటారు. కేటీఆర్, హరీశ్ రావులు రేపు తీహార్ జైల్లో కవితను కలవనున్నారు.
Next Story