Sun Mar 08 2026 14:02:30 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ చేరుకున్న తారకరత్న పార్ధీవదేహం
బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన తారకరత్న పార్ధీవ దేహం హైదరాబాద్ కు చేరుకుంది

బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన తారకరత్న పార్ధీవ దేహం హైదరాబాద్ కు చేరుకుంది. హైదరాబాద్ లోని మోకిలలోని ఆయన స్వగృహానికి తీసుకు వచ్చారు. కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ఆయన పార్ధీవ దేహానికి రేపు అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
రేపు అంత్యక్రియలు...
రేపు అభిమానుల సందర్శనార్ధం తారకరత్న పార్ధీవ దేహాన్ని ఫిలింఛాంబర్ కు తీసుకువస్తారు. రేపు సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి తారకరత్న నిన్న బెంగళూరు ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Next Story

