Tue Feb 24 2026 12:31:39 GMT+0530 (India Standard Time)
Telangana : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడంటే?
తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి

తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి. నిన్న మంత్రి వర్గ సమావేశంలో చర్చించి తేదీలను నిర్ణయించారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిన వెంటనే జరపాలని నిర్ణయించారు. పద్దులకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
మార్చి 16 నుంచి...
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మార్చి 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మార్చి 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. మార్చి 16న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేయనున్నారు. మార్చి 17, 18న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చిస్తారు.
Next Story

