Sun Mar 08 2026 08:51:19 GMT+0530 (India Standard Time)
డీఎస్ చేరికకు ముహూర్తం ఫిక్స్
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ లోచేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది.

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ లోచేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఆయన ఈ నెల 24వ తేదీన సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పార్టీ అధినేత కేసీఆర్ ను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో డి.శ్రీనివాస్ పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.
రాజ్యసభ పదవి....
ఈ నేపథ్యంలోనే ఇటీవల సోనియా గాంధీని కలిసి చర్చించారు. సోనియా డీఎస్ చేరికకు సుముఖత వ్యక్తం చేయడంతో ఆయన ఈ నెల 24వ తేదీన పార్టీలో చేరనున్నారు. ఆయన చేరికపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినా అధిష్టానం సుముఖత వ్యక్తం చేయడంతో మౌనంగా ఉండిపోయారు. డీఎస్ రాజ్యసభ పదవి ఈ ఏడాది జూన్ తో ముగియనుంది.
Next Story

