Wed Mar 11 2026 14:17:35 GMT+0530 (India Standard Time)
Danam Nagender : సుప్రీంకోర్టులోనూ వాదనలు వినిపిస్తా
సుప్రీంకోర్టులోనైనా తన వాదనలను వినిపిస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.

తాను సుప్రీంకోర్టులోనైనా తన వాదనలను వినిపిస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. తాను పార్టీ మారారనడానికి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారు. తాను పార్టీ మారినట్లు చెప్పాల్సింది పార్టీ అధినేత కేసీఆర్ అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాదని దానం నాగేందర్ అన్నారు. తనకు ఏ ఎన్నికల్లోనైనా ఒక పౌరుడిగా పోటీ చేసే హక్కు, అర్హత ఉన్నాయని దానం నాగేందర్ తెలిపారు.
డ్రామాలు ఆడుతున్నారంటూ...
బీజేపీ, బీఆర్ఎస్ లు కేవలం డ్రామాలు ఆడుతున్నాయని, రెండు పార్టీలపై దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి తనను ఎందుకు ఆహ్వానించలేదని కూడా దానం ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కాలేదని కేసీఆర్ కు ఇబ్బంది లేదని, కానీ సీఎం పదవి తనకు రాకుండా పోయిందని కేటీఆర్ కు చాలా ఇబ్బందిగా ఉందని దానం నాగేందర్ అన్నారు.
Next Story

