Fri Dec 26 2025 06:20:57 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులతో తిరుపతి, యాదాద్రి, విజయవాడ, శ్రీశైలం, సింహాచలం, వేములవాడ ఆలయాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అన్ని ఆలయాల్లో భక్తులు ఒక్కసారిగా పోటెత్తడంతో అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
గంటల తరబడి...
అన్ని ఆలయాల్లో స్వామి వారి దర్శనానికి గంటల తరబడి క్యూ లైన్ లలో వేచి ఉండాల్సిన పరిస్థితులున్నాయి. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోతుండంతో ఆలయ అధికారులు దర్శనానికి అసవరమైన విషయంలో భక్తులను తొందరపెడుుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్ లలో వేచి ఉంటూ తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
Next Story

