Thu Jan 29 2026 01:45:08 GMT+0000 (Coordinated Universal Time)
యాదగిరి గుట్టకు పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆదివారం సెలవురోజు కావడంతో భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది

యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆదివారం సెలవురోజు కావడంతో భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. స్వామివారి ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం అంటే యాదగిరిగుట్టకు అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచి మాత్రమే కాకుండా అనేక మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి భక్తులు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు.
ఆదివారం కావడంతో...
ఆదివారం రద్దీ ఎక్కువగా ఉండటంతో దర్శనం త్వరగా పూర్తయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు క్యూ లైన్ లలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు వీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉండటంతో పాటు మొక్కులు చెల్లించే వారు కూడా అధికంగా ఉండటంతో దర్శనం చాలా వరకూ ఆలస్యమవుతుంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

