Fri Dec 05 2025 14:38:14 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడు వరకే మా మద్దతు
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు సీపీఎం మద్దతు ప్రకటించింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు

మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ కు సీపీఎం మద్దతు ప్రకటించింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. క్యాడర్ తో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తమ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ కు ఎందుకు కోమటిరెడ్డి రాజీనామా చేయాలో చెప్పాలని ఆయన కోరారు. తమకు మద్దతివ్వాలని ఆన్ని పార్టీలు కోరాయన్నారు. కానీ బీజేపీని ఓడించడానికి తాము టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు తమ్మినేని వీరభద్రం తెలిపారు.
బీజేపీని ఓడించేందుకే....
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మునుగోడులో బీజేపీని గెలిపిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని చెప్పడమేంటని ఆయన ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటుందని ఆయన అన్నారు. రేవంత్ కష్టపడుతున్నారు. ఆయన పీసీసీ అధ్యక్షుడయ్యాక పార్టీ బలోపేతం అవుతుంది కాని, బీజేపీని ఓడించాలంటే మునుగోడులో టీఆర్ఎస్ కు మద్దతివ్వక తప్పదన్నారు. అయితే టీఆర్ఎస్ కు తమ మద్దతు మునుగోడు వరకే అని తమ్మినేని వీరభద్రం తెలిపారు. మునుగోడులో మద్దతు ఇచ్చినంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
Next Story

