Sat Mar 07 2026 18:43:04 GMT+0530 (India Standard Time)
మునుగోడులో టీఆర్ఎస్ కే మా మద్దతు
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి తెలిపారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి తెలిపారు. బీజేపీని ఓడించాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తమను ఇబ్బంది పెట్టిందన్నారు. మాకు ఇచ్చిన మూడు సీట్లలో కూడా పోటీకి దింపిందన్నారు. బీజేపీ ఓడించే సత్తా ఉన్న పార్టీకే తాము మద్దతిస్తామని తెలిపారు. కాంగ్రెస్ కు ఆ శక్తి లేదని భావించామన్నారు. మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్యే పోటీ ఉంటుందని భావించి టీఆర్ఎస్ కు తమ మద్దతు ఇస్తున్నామని చాడా వెంకటరెడ్డి తెలిపారు.
సభలో తమ ప్రతినిధిగా....
తమ పార్టీ తరుపున మునుగోడు టీఆర్ఎస్ సభలో పల్లా వెంకటరెడ్డి హాజరవుతారన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీని అడ్డుకోవాలంటే గెలిచే పార్టీలకే మద్దతివ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీని ఓడించే సత్తా ఒక టీఆర్ఎస్ కే ఉందని ఆయన తెలిపారు. అందుకే ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. తాము అక్కడ ఐదు సార్లు గెలిచామని, అయినా అక్కడి నియోజకవర్గం నేతల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
Next Story

