Mon Mar 16 2026 13:31:39 GMT+0530 (India Standard Time)
కాంగ్రెస్తోనే కలసి ముందుకు
తెలంగాణలో కాంగ్రెస్తో చర్చలు జరుగుతున్నాయని సీపీఐ నేత నారాయణ తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్తో చర్చలు జరుగుతున్నాయని సీపీఐ నేత నారాయణ తెలిపారు. పొత్తులు కుదిరే అవకాశముందని ఆయన చెప్పారు. సీట్లు ఎన్ని అనేవి పొత్తుల చర్చల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తమకు బలమైన స్థానాల్లో పోటీ చేస్తామని నారాయణ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఈసారి మార్పు కోరుకుంటున్నారన్న నారాయణ కాంగ్రెస్ తో కలసి నడిచేందుకు వామపక్ష పార్టీలు సిద్ధమయ్యాయని తెలిపారు.
ఎన్ని స్థానాలనేది...
తాము ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నది త్వరలోనే క్లారిటీ రానుందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కమ్యునిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న స్థానాల్లోనే తాము బరిలోకి దిగుతామని చెప్పిన నారాయణ జాతీయ స్థాయిలో తాము ఇండియా కూటమిలో ఉన్న విషయాన్ని కూడా ఆయన ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. పొత్తుల చర్చలు విఫలమయితే తాము బలంగా ఉన్న చోట ఒంటరిగానైనా పోటీకి దిగుతామని నారాయణ చెప్పారు.
Next Story

