Sun Mar 15 2026 11:54:37 GMT+0530 (India Standard Time)
Telangana Governor:తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం
తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన చేత ప్రమాణం చేయించారు

Telangana Governor:తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన చేత రాజ్‌భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. తమిళనాడుకు చెందిన రాధా కృష్ణన్ కోయంబత్తూరు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. కేరళలో బీజేపీ ఇన్ఛార్జిగా పనిచేసిన రాధాకృష్ణన్ తర్వాత ఝార్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు.
ఇన్‌ఛార్జి గవర్నర్ గా...
తమిళిసై సౌందర్ రాజన్ తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్రపతి రాధాకృష్ణన్ ను ఇన్‌ఛార్జి గవర్నర్ గా నియమించారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ గా కూడా రాధాకృష్ణన్ కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Next Story

