Fri May 17 2024 08:22:19 GMT+0000 (Coordinated Universal Time)
జూబ్లీహిల్స్ లో నిలిచిపోయిన కౌంటింగ్
జూబ్లీహిల్స్ లో కౌంటింగ్ నిలిచిపోయింది. ఈ నియోజకవర్గానికి సంబంధించి
జూబ్లీహిల్స్ లో కౌంటింగ్ నిలిచిపోయింది. ఈ నియోజకవర్గానికి సంబంధించి 11 రౌండ్ల వరకూ మాత్రమే కౌంటింగ్ జరిగింది. జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరోసారి పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్ పోటీ చేశారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. పార్టీ అధిష్టానికి ఫిర్యాదు చేశారు. ప్రత్యర్థికి మెజార్టీ ఎక్కువగా చూపిస్తున్నారని అజారుద్దీన్ ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
Next Story